గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన ఐపీఎల్ 2022 ఫైనల్

గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన ఐపీఎల్ 2022 ఫైనల్

ఐపీఎల్ ఫైనల్ 2022 గిన్నిస్ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడు లేని విధంగా ఫైనల్ మ్యాచ్కు లక్షకు పైగా ఫ్యాన్స్ హాజరవడంతో ఈ మ్యాచ్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఏ మ్యాచ్కు కూడా ఇంత మంది అభిమానులు హాజరవ్వలేదు. దీన్ని గుర్తించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు..బీసీసీఐకి గిన్నిస్ రికార్డు పత్రాన్ని అందజేశారు.  ఈ ఏడాది మే 29న ఐపీఎల్ ఫైనల్ జరిగింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో నరేంద్రమోడీ స్టేడియం  ఆతిథ్యమిచ్చింది. ఈ ఫైనల్ ను చూసేందుకు లక్షా 1566 మంది హాజరవడంతో ఈ మ్యాచ్ అరుదైన ఘనత సాధించింది. 

ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ..

టీ20 చరిత్రలో ఓ మ్యాచ్కు లక్షకు పైగా అభిమానులు హాజరవడంలో ఇదే మొదటిసారి. దీంతో ఐపీఎల్ ఫైనల్ 2022 మ్యాచ్ గత రికార్డులన్ని బద్దలు కొట్టింది. ఈ మేరకు బీసీసీఐ ట్విట్టర్లో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. టీమిండియాకు ఇది గర్వకారణం..ఐపీఎల్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఈ రికార్డు ఫ్యాన్స్కు అకింతం..అని రాసుకొచ్చింది. 

క్రెడిట్ అభిమానులకే..

 

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వారి నుంచి ప్రశంసా పత్రాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా అందుకున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు పత్రాన్ని అందుకున్నందుకు ఆనందంగా ఉందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఐపీఎల్ 2022 ఫైనల్కు 1,01, 566 మంది హాజరైనందుకు ఈ ఘనత సాధ్యమైందన్నాడు. ఈ క్రెడిట్ ఐపీఎల్ అభిమానులకు దక్కుతుందని పేర్కొన్నాడు. 


మార్పు మంచికే...

అహ్మదాబాద్లోని మోతెరా స్టేడియంలో గతంలో 49 వేలు మాత్రమే సీటింగ్ కెపాసిటీ ఉండేది. అయితే స్టేడియాన్ని సరికొత్తగా తీర్చిదిద్దిన తర్వాత నరేంద్రమోడీ స్టేడియంగా నామకరణం చేశారు. ఆ తర్వాత సీటింగ్ కెపాసిటీని లక్షా 32వేలకు పెంచారు. 

గుజరాత్ విన్నర్..

రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ విజేతగా నిలిచింది. ముందుగా  బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్  20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత గుజరాత్ 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరి టైటిల్ను సాధించింది.