ఓల్డ్​సిటీలో గుజరాత్ ఏటీఎస్ సోదాలు

ఓల్డ్​సిటీలో గుజరాత్ ఏటీఎస్ సోదాలు
  • మెడికల్ షాప్ ఓనర్ స్టేట్​మెంట్ రికార్డ్
  • అదుపులో ఇద్దరు అనుమానితులు 

హైదరాబాద్/గోదావరిఖని, వెలుగు: గుజరాత్​కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌‌‌‌ (ఏటీఎస్) టీమ్​ మంగళవారం ఓల్డ్‌‌‌‌ సిటీలోని కాలాపత్తర్ లో ముగ్గురు అనుమానితుల ఇండ్లను తనిఖీలు చేసింది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మెడికల్ షాప్ నిర్వాహకుడు ఫసియుల్లా ఖాద్రీని విచారించి స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికార్డ్‌‌‌‌ చేసినట్లు సమాచారం.

ఏటీఎస్‌‌‌‌ టీమ్ తనిఖీల విషయాన్ని ముందుగానే లోకల్ పోలీసులకు తెలిపింది. గుజరాత్‌‌‌‌లోని సూరత్​కు చెందిన సమీర బాను, శ్రీనగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఉబైద్ నసీర్, హనన్ హయత్‌‌‌‌ షా, మహ్మద్ హజిమ్ షా పోరుబందర్‌‌‌‌ సముద్రమార్గంలో ఇరాన్‌‌‌‌ మీదుగా అఫ్గానిస్తాన్ వెళ్లాలనుకున్నారు. వీరిని ఈనెల 9న ఏటీఎస్ టీమ్ అరెస్ట్ చేసింది. అక్రమంగా దేశం దాటి ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరసాన్ ప్రావిన్స్’లో చేరేందుకు వెళ్తున్నట్లు గుర్తించింది. ఈ నలుగురు ఇచ్చిన సమాచారంతో ఏటీఎస్ దేశవ్యాప్తంగా సోదాలు జరుపుతున్నది. 

గోదావరిఖనిలో తండ్రీ, కూతురు?

గోదావరిఖనిలోని శ్రీనగర్‌‌‌‌‌‌‌‌ కాలనీలో ఓ ఇంట్లో తండ్రీ, కూతురును గుజరాత్‌‌‌‌‌‌‌‌ ఏటీఎస్​ పోలీసులు మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని గోల్కొండ టోలీచౌక్‌‌‌‌‌‌‌‌ ప్రాంతానికి చెందిన వీరికి, టెర్రరిస్టులతో సంబంధాలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గుజరాత్‌‌‌‌‌‌‌‌ ఏటీఎస్​ టీమ్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని తమ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ ద్వారా వీరి గురించి ఆరా తీయగా, ఆ సమాచారం తెలుసుకొని వీరు ఈ నెల 23న గోదావరిఖనిలోని శ్రీనగర్‌‌‌‌‌‌‌‌ కాలనీకి వచ్చి ఒకరింట్లో షెల్టర్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు తరలించినట్టు తెలుస్తోంది. వీరితో రామగుండం కమిషనరేట్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని ఓ సీఐ కూడా వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.