మహిళల హాకీ జట్టుకు గుజరాత్ వ్యాపారి సూపర్ ఆఫర్‌

మహిళల హాకీ జట్టుకు గుజరాత్ వ్యాపారి సూపర్ ఆఫర్‌

టోక్యో ఒలింపిక్స్ లో సత్తా చాటి పతకాలను సాధించినవారికి భారత్ ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, కొంతమంది వ్యాపారులు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో భారత మహిళల హాకీ జట్టుకు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి సావ్‌జీ ధోలాకియా బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు.

ఒలింపిక్స్‌ పతకం గెలుచుకొని వస్తే సొంత ఇల్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మహిళల హాకీ జట్టు సభ్యులందికి రూ.11లక్షలు ఇస్తానని హెచ్‌కే గ్రూప్‌ అధినేత ప్రకటించారు. ఇళ్లున్నవారికి కారు గిఫ్టుగా ఇస్తానని తెలిపారు. టోక్యో-2020 ఒలింపిక్స్‌లో మహిళల జట్టు మంగళవారం (ఆగస్టు 3,2021) జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఒడించి సెమీఫైనల్‌కు చేరిన సందర్భంగా ధోలాకియా ట్విట్టర్‌ ద్వారా ఈ ప్రకటన చేశారు. 

దాదాపు 20 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత మహిళల జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. క్వార్టర్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియాలాంటి జట్టును మట్టికరిపించి.. సెమీ ఫైనల్‌కు చేరింది. ఇక సెమీస్‌లో భారత మహిళా జట్టు అర్జెంటీనాతో తలపడనుంది.