కేజ్రీవాల్కు హైకోర్టు షాక్..మోడీ విద్యార్హతలు నీకెందుకు

కేజ్రీవాల్కు హైకోర్టు షాక్..మోడీ విద్యార్హతలు నీకెందుకు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు  గుజరాత్ హైకోర్టు షాకిచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలకు సంబంధించి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికెట్లను బయటకు చూపించాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రధాని విద్యార్హతల వివరాలు అడుగుతూ కోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్ కు రూ.25 వేల జరిమానా విధించింది. ప్రధాన మంత్రి కార్యాలయం అలాంటి వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది.

కోర్టు ఆగ్రహం..

ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతల వివరాలను చెప్పాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కేజ్రీవాల్ పై అసహనం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి కార్యాలయం ప్రధాని మోడీ విద్యార్హత  వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది. గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీల పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ ద్వారా  మోడీ విద్యార్హతల  వివరాలు తెలపాలన్న కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టి వేస్తూ ఈ తీర్పుచెప్పింది. 

ఇది అనవసరం...

కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు మొట్టికాయలు వేసింది. అసలు ఇది అనవసరం అని కొట్టిపారేసింది. ఈ పిటిషన్ వేసిన అరవింద్ కేజ్రీవాల్‌కు రూ.25 వేల జరిమానా విధించింది. ఈ జరిమానాను గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. నిజానికి 2016లోనే సెంట్రల్ ఇన్‌ఫర్మేషన్ కమిషన్..గుజరాత్ యూనివర్సిటీకి అప్పట్లోనే పలు సూచనలు చేసింది. 

చెప్తే తప్పేముంది..

గుజరాత్ హైకోర్టు తీర్పుపై  అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.  ప్రధాని మోడీ ఏం చదువుకున్నాడో తెలుసుకోవడం తప్పేలా అవుతుందంటూ చెప్పుకొచ్చారు. మోడీ విద్యార్హతలు చెప్పడానికి పీఎంవోకు ఏంటీ సమస్యా అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఏం చదువుకున్నారో తెలుసుకోవద్దా అని నిలదీశారు. మోడీ విద్యార్హతలు అడిగితే జరిమానా వేస్తారా...అని అడిగారు.