మోర్బి ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వానికి గుజరాత్​ హైకోర్టు నోటీసులు

మోర్బి ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వానికి గుజరాత్​ హైకోర్టు నోటీసులు

అహ్మదాబాద్: గుజరాత్​లోని మోర్బిలో కేబుల్​ బ్రడ్జి కూలిన దుర్ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ప్రస్తుత స్థితిపై నవంబర్​ 14లోపు నివేదిక అందజేయాలని సోమవారం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక అధికారులకు నోటీసులు జారీ చేసింది. మోర్బిలోని మచ్చు నదిపై ఉన్న తీగల వంతెన అక్టోబర్​ 30న కూలిపోయి 135 మంది మృతిచెందారు.

ఈ ఘటనపై వార్తా పత్రికలలో వచ్చిన కథనాల ఆధారంగా చీఫ్​ జస్టిస్​ అరవింద్​ కుమార్, జస్టిస్​ అశుతోశ్​​ శాస్ర్తీలతో కూడిన బెంచ్​ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హోం శాఖ, మోర్బి మున్సిపల్​ కమిషనర్​, కలెక్టర్​కు నోటీసులు జారీ చేసింది. నవంబర్​ 14న విచారిస్తామని పేర్కొన్నది. పూర్తి నివేదిక అందించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను కూడా ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.