అప్పుడు జంపైన పెళ్లి కొడుకు తండ్రి ..పెళ్లి కూతురు తల్లి ఇప్పుడు తిరిగొచ్చారు

అప్పుడు జంపైన పెళ్లి కొడుకు తండ్రి ..పెళ్లి కూతురు తల్లి ఇప్పుడు తిరిగొచ్చారు

కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ ఇన్సిడెంట్ గుర్తుండే ఉంటుంది. మరికొద్దిరోజుల్లో ఓ యువ జంటకు పెళ్లి కావాల్సి ఉండగా..పెళ్లి కొడుకు తండ్రి , పెళ్లి కూతురు తల్లి ఇద్దరు జంప్ అయ్యారు. అయితే అప్పుడు వెళ్లిన ఆ ఇద్దరు మళ్లీ తిరిగొచ్చారు. ఎందుకంటే..?

గుజరాత్ కాటర్గామ్‌కి చెందిన బిజినెస్‌ మ్యాన్ హిమ్మత్ యుక్త వయసులో ఉన్నప్పుడు శోభన అనే యువతిని ప్రేమించాడు. అయితే ప్రేమ వ్యవహారం ఇంట్లో నచ్చకపోవడంతో బిజినెస్ మ్యాన్, అతని ప్రియురాలు వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. విధి ఆడిన వింతనాటకంలో 25 ఏళ్ల గడిచిన తర్వాత ఇప్పుడు హిమ్మత్ , శోభన పిల్లలు పెళ్లికి ఎదిగారు. వారికి సంబంధాలు చూస్తుండగా… అనుకోకుండా విధి ఆ రెండు కుటుంబాలనే ఒక చోటకి చేర్చింది. ఏడాది క్రితం వారి పిల్లలకు పెళ్లి చూపులు జరిగాయి. ఒకరికొకరు నచ్చారు. అంతా ఓకే అనుకుని.. ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. మరో నెలరోజుల్లో వైభవంగా పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు.

కానీ  కుర్ర వయసులో ఆ పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లికి మధ్య నడిచిన ప్రేమ.. మళ్లీ ఎదురుపడ్డాక ఆ నాటి జ్ఞాపకాలను చిగురింపజేసింది. వారు తమ పిల్లల పెళ్లి చేయకలేకపోయారు. వారిద్దరూ లేటు వయసులోనైనా ఒక్కటవ్వాలని ఇంటి నుంచి వెళ్లిపోయారు.

అలా వెళ్లిన భగ్నప్రేమికులు మళ్లీ తిరిగొచ్చారు. ఇంటికి శోభనను భర్త ఇంట్లోకి రానీయలేదు. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లింది. తిరిగొచ్చాక ఆమె ప్రియుడు హిమ్మత్ మాట్లాడుతూ నా వల్ల ఆమె బాధపడటం నాకిష్టం లేదు. ఆమె భర్త తనను అంగీకరించకపోయినా.. తను మంచి జీవితం గడపడానికి నేను హామీ ఇస్తున్నాని చెప్పాడు