బెంగళూరు ఇంటికి .. కోహ్లీ సెంచరీ వృథా

బెంగళూరు ఇంటికి .. కోహ్లీ సెంచరీ వృథా
  • గుజరాత్‌‌‌‌ చేతిలో ఓడి ప్లే ఆఫ్స్‌‌‌‌కు దూరం
  • సెంచరీతో అదరగొట్టిన గిల్‌‌‌‌ 
     

బెంగళూరు: గెలిస్తే ప్లే ఆఫ్స్‌‌ బెర్త్‌‌ దక్కే అవకాశం ఉన్న మ్యాచ్‌‌లో రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు నిరాశపర్చింది. కింగ్‌‌ కోహ్లీ (61 బాల్స్‌‌లో 13 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 101 నాటౌట్‌‌) సెంచరీతో చెలరేగినా బౌలర్లు ఫెయిల్‌‌ కావడంతో.. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్‌‌ మ్యాచ్‌‌లో ఆర్‌‌సీబీ 6 వికెట్ల తేడాతో గుజరాత్‌‌ టైటాన్స్‌‌ చేతిలో ఓడి నాకౌట్‌‌ రేస్‌‌కు దూరమైంది. టాస్‌‌ ఓడిన బెంగళూరు 20 ఓవర్లలో 197/5 స్కోరు చేసింది. తర్వాత శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (52 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 8 సిక్స్‌‌లతో 104 నాటౌట్‌‌) వీరోచిత సెంచరీతో గుజరాత్‌‌ 19.1 ఓవర్లలో 198/4 స్కోరు చేసి గెలిచింది. విజయ్‌‌ శంకర్‌‌ (53) హాఫ్‌‌ సెంచరీతో మెరిశాడు. 

ఛేజింగ్‌‌లో వృద్ధిమాన్‌‌ సాహా (12) ఫెయిలైనా, శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, విజయ్‌‌ శంకర్‌‌ నిలకడగా ఆడారు. దీంతో పవర్‌‌ప్లేలో 51/1తో ఉన్న గుజరాత్‌‌ 11వ ఓవర్‌‌లోనే 100 రన్స్‌‌కు చేరింది. ఈ క్రమంలో గిల్‌‌ 29 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ ఫినిష్‌‌ చేశాడు. రెండో ఎండ్‌‌లో 34 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ చేసిన విజయ్‌‌ శంకర్‌‌ను 15వ ఓవర్‌‌లో వైశాక్‌‌ (1/40) పెవిలియన్‌‌కు పంపడంతో రెండో వికెట్‌‌కు 123 రన్స్‌‌ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాతి ఓవర్‌‌లో డాసున్‌‌ షనక (0) డకౌట్‌‌ కాగా, డేవిడ్‌‌ మిల్లర్‌‌ (6) కూడా నిరాశపర్చాడు.  లాస్ట్‌‌ నాలుగు ఓవర్లలో 43 రన్స్‌‌ కావాల్సిన దశలో రాహుల్‌‌ తెవాటియా (4 నాటౌట్‌‌)తో కలిసి  గిల్‌‌ 6, 6, 6, 6తో విక్టరీ అందించాడు. 

కింగ్‌‌ కోహ్లీ

ఓవైపు వర్షం.. మరోవైపు ప్లే ఆఫ్స్‌‌ బెర్త్‌‌ నేపథ్యంలో కింగ్‌‌ కోహ్లీ తన పాత ఆటను బయటకు తీశాడు. జీటీ బౌలింగ్‌‌ను చితక్కొడుతూ  తన ట్రేడ్‌‌ మార్క్‌‌ ఫోర్లు, సిక్సర్లతో మెగా లీగ్‌‌లో రికార్డు స్థాయిలో ఏడో సెంచరీతో ఆకట్టుకున్నాడు.   ఆరంభంలో కోహ్లీ, డుప్లెసిస్‌‌ (28) బౌండ్రీల వర్షం కురిపించడంతో పవర్‌‌ప్లేలో ఆర్‌‌సీబీ 62/0 స్కోరు చేసింది. అయితే నూర్‌‌ అహ్మద్‌‌ (2/39) రావడంతో స్కోరుకు బ్రేక్‌‌లు పడ్డాయి. 

8వ ఓవర్‌‌లో డుప్లెసిస్‌‌ను ఔట్‌‌ చేసిన నూర్‌‌ తొలి వికెట్‌‌ 67 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ చేశాడు. తర్వాత వరుస విరామాల్లో మ్యాక్స్‌‌వెల్‌‌ (11), మహిపాల్‌‌ లోమ్రోర్‌‌ (1) ఔట్‌‌కావడంతో ఆర్‌‌సీబీ 85/3తో నిలిచింది. 35 బాల్స్‌‌లో ఫిఫ్టీ చేసిన కోహ్లీకి బ్రాస్‌‌వెల్‌‌ (26) కాసేపు అండగా నిలిచాడు. నాలుగో వికెట్‌‌కు 47 రన్స్‌‌ జోడించి ఔటయ్యాడు. ఆ వెంటనే దినేశ్‌‌ కార్తీక్‌‌ (0) ఔటైనా, అనూజ్‌‌ రావత్‌‌ (23 నాటౌట్‌‌) నిలకడగా ఆడాడు. ఎక్కువగా స్ట్రయిక్‌‌ తీసుకున్న కోహ్లీ చివరి వరకు క్రీజులో ఉండి సూపర్‌‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు.