IPL2026: GT vs PBKS హెడ్ టు హెడ్ రికార్డులు..

IPL2026: GT vs PBKS హెడ్ టు హెడ్ రికార్డులు..

IPL2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్‌లోని తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) పోటీ పడనున్నాయి. ఈ పోరు ఈరోజు  ( 2026, మార్చి 31న) న్యూ చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో గల మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. పంజాబ్ యొక్క దూకుడైన బ్యాటింగ్ శైలికి, గుజరాత్ పటిష్టమైన బౌలింగ్ దళానికి మధ్య జరగనున్న ఈ పోరు ఉత్కంఠభరితంగా సాగనుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. 

సమతుల్యమైన జట్లు:  
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు స్టార్ ఆటగాళ్లతో నిండిన బ్యాటింగ్ లైనప్‌పై ఆధారపడింది. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ల ఓపెనింగ్ జోడి ఆ జట్టుకి మరింత బలాన్ని చేకూర్చనుంది. మరోవైపు, అర్ష్‌దీప్ సింగ్ , యుజ్వేంద్ర చాహల్ వారి కీలక బౌలర్లుగా కొనసాగుతున్నారు. మరోవైపు, రషీద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడాలతో కూడిన తమ బౌలింగ్ దళంపై గుజరాత్ టైటాన్స్ ఆధారపడనుంది. ఓపెనర్లుగా, కెప్టెన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ ఆ జట్టుకి అదనపు బలాన్ని చేకూర్చనుంది. 

హెడ్ టు హెడ్ రికార్డులు: 
ఈ రెండు జట్ల మధ్య ఏమాత్రం తేడాలు కనిపించడం లేదు. 2022 సీజన్‌లో గుజరాత్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆరుసార్లు తలపడ్డాయి. ఇరు జట్లు చెరో మూడుసార్లు విజయం సాధించగా మరో మూడుసార్లు ఓటములను నమోదు చేశాయి. ఈ పోటీ ఎంత తీవ్రంగా ఉందంటే, ఏ జట్టు కూడా మరొకదానిపై వరుస మ్యాచ్‌లలో విజయం సాధించలేదు. 

కాగా, టీ20 ప్రపంచ కప్ 2026 జట్టు నుంచి తొలగించబడిన తర్వాత శుభ్‌మన్ గిల్ ఈ ఐపీఎల్ లోనే తన మొదటి టీ20 మ్యాచ్‌ ఆడబోతున్నాడు. గత సీజన్‌లో జోస్ బట్లర్ దాదాపు 60 శాతం స్ర్కైక్ రేటుతో 538 పరుగులు చేయగా, సుదర్శన్ ఏకంగా 759 పరుగులతో ఆరెంజ్ క్యాప్ ని దక్కించుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా గత సీజన్‌లో అద్భుతమైన బ్యాటింగ్ ని కొనసాగించాడు. 175.07 స్ట్రైక్ రేట్‌తో 600కు పైగా పరుగులు సాధించాడు. 22.76 సగటుతో 221 వికెట్లతో, యజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.