
రీల్స్ పిచ్చి ముదిరిపోతుంది. కొందరు యువతీయువకులు ఇన్ స్టా రీల్స్ కు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారు. బిల్డింగులపై నుంచి వేలాడటం.రన్నింగ్ ట్రైన్ లు, బస్సులు, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రీల్స్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వారు చేసే రీల్స్ బెడిసి కొడుతున్నాయి. ఇటీవలే పూణెలో ఓయువతి బిల్డింగ్ పై నుంచి వేలాడుతూ ప్రమాదకర స్టంట్ చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే..
లేటెస్ట్ గా గుజరాత్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. రీల్స్ పిచ్చితో రెండు కార్లను సముద్రంలోకి తీసుకెళ్లారు యువకులు. అంతే అలలు రావడంతో కార్లు సముద్రంలో చిక్కుకుపోయాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గుజరాత్ - కచ్ ప్రాంతంలో గల ముంద్రా తీరం దగ్గర కొందరు యువకులు ఫేమస్ అయ్యేంందుకు రెండు మహేంద్ర థార్ కార్లతో సముద్రంలో స్టంట్స్ చేద్దామనుకున్నారు.రెండు ఎస్‌యూవీలతో స్టంట్స్ చేయబోయారు. అయితే అలలు ఎక్కువవడంతో రెండు వాహనాలు ఇసుకలో కూరుకుపోయాయి. రెడ్ కలర్ కారు సగానికి పైగా మునిగిపోయింది. ఇంకో వైట్ కలర్ కారు వెనుక భాగం నీటిలో మునిగి ముందు బాగం కొద్దిగా మునిగింది.
కార్లను బయటకు తీసేందుకు యువకులు ప్రయత్నించారు. అయితే అక్కడే ఉన్న కొందరు జాలర్లను ఆ యువకులను రక్షించి కార్లను బయటకు తీశారు. ఈ ఘటన వైరల్ కావడంతో సముద్రంలో స్టంట్స్ వేసిన యుకువలపై ముంద్రా పోలీసులు కేసు నమోదుచేశారు.