
పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ హక్కుల నాయకురాలు గులలై ఇస్మాయిల్ అమెరికాకు పారిపోయారు. తనకు రాజకీయ ఆశ్రయం కల్పించాలంటూ ఆమె అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. దేశవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ సొంతదేశంలో ఆమెపై పలు ఆరోపణలున్నాయి. పాక్ ఇంటెలిజన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఐ కూడా ఆమెపై నిఘా పెంచింది. గులలై పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవడంతోపాటు ఆమెపై అవసరమైన అన్ని చర్యలు తీసుకోవచ్చని ఇస్లామాబాద్ హైకోర్టు కూడా ఐఎస్‌ఐను ఆదేశించింది. దీంతో ఆందోళనకు గురైన హక్కుల నాయకురాలు నెలరోజుల క్రితం పాకిస్తాన్ నుంచి తప్పించుకుని అమెరికాకు వచ్చారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.