వైట్ హౌజ్ లో మరోసారి కాల్పులు.. ట్రంప్ టార్గెట్ గా గన్ ఫైర్..ఇరాన్ తో శాంతిచర్చలు జరుపుతున్న సమయంలో ఘటన

వైట్ హౌజ్ లో మరోసారి కాల్పులు.. ట్రంప్ టార్గెట్ గా గన్ ఫైర్..ఇరాన్ తో శాంతిచర్చలు జరుపుతున్న సమయంలో ఘటన

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. వాషింగ్టన్ లోని వైట్ హౌజ్  సమీపంలో గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపాడు. కాల్పుల సమయంలో ట్రంప్ వైట్ హౌజ్ లోనే ఉన్నారు. ఇరాన్ తో శాంతి చర్చలు జరుపుతున్న సమయంలో  కాల్పులు జరగడం చర్చనీయాంశంగా మారింది. సీక్రెట్ సర్వీస్ చెక్ పాయింట్ లోకి దూసుకొచ్చిన దుండగుడు భద్రతా సిబ్బందిపై ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. దాదాపు  15 నుంచి 30 రౌండ్ల గన్ ఫైర్ జరిగినట్లు సిబ్బంది తెలిపారు. ఘటనతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది..వైట్ హౌజ్  కాంప్లెక్స్ ను లాక్ డౌన్ చేశారు. దుండుగుడిని కాల్చి చంపారు.