
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. హారిక హాసిని బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే కొంత పార్ట్ షూట్ పూర్తి చేశారు. శనివారం నుంచి కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేసినట్టు మేకర్స్ తెలియజేశారు. హైదరాబాద్ శంకరపల్లి దగ్గరలో వేసిన భారీ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఇంపార్టెంట్ యాక్షన్ సీన్స్‌ను తీయబోతున్నారట. అలాగే నటీనటులంతా పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది.
పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఆగస్టులో మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా మరో టీజర్‌ను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక హీరోయిన్‌గా పూజాహెగ్డే ప్లేస్‌లో మీనాక్షి చౌదరిని తీసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై నిర్మాతల నుండి క్లారిటీ రావాల్సి ఉంది.