Guntur Karam Posters: ఈ సారి నో లిమిట్స్..ఓన్లీ ఊచకోత

Guntur Karam Posters: ఈ సారి నో లిమిట్స్..ఓన్లీ ఊచకోత

స్టార్ హీరో మహేష్ బాబు(Mahesh Babu) డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం గుంటూరు కారం(GunturKaaram). ఈ సినిమా విషయంలో మొదటి నుంచి ఎక్కడో ఒక చోట నెగిటివిటీ ఏర్పడుతూ వచ్చింది. థమన్ ఇస్తున్న సాంగ్స్ కానివ్వొచ్చు..ఫస్ట్ టీజర్ కానివ్వొచ్చు ఇలా గుంటూరు కారం మీద కొన్ని ట్రోల్స్ బాగా హడావుడి చేశాయి.

అందులో భాగంగానే కొన్ని లీక్స్ కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటిపై మహేష్ సైతం త్రివిక్రంతో డిస్కస్ చేశాడని తెలుస్తోంది. నిర్మాత నాగ వంశీ మాత్రం వీటిని పట్టించుకోవద్దు సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేస్తున్నాం..ఈ సారి నో లిమిట్స్..ఓన్లీ ఊచకోత అని చెప్పేస్తున్నారట.

లేటెస్ట్గా గుంటూరు కారం నుంచి మహేష్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. చెక్స్ షర్ట్..లుంగీలో మహేష్ డాషింగ్ లుక్స్ అదిరిపోయాయి.ఈ పోస్టర్తో గుంటూరు కారంపై ఇప్పటివరకు వచ్చిన నెగిటివిటీ మొత్తం ఒక్కసారిగా పోయింది. మహేష్ లోని ఊర మాస్ యాటిట్యూడ్ని త్రివిక్రమ్ ఈ సినిమాలో చూపిస్తునారని అర్థమవుతుంది.

ఈ పోస్టర్లో మహేష్ లుంగి లుక్ తో పాటు హీరోయిన్ శ్రీలీల అలా ముందుకు వస్తున్న స్టిల్ అదిరిపోయింది. అంతేకాకుండా త్వరలో ఈ కాంబో నుంచి స్పైసీ మాస్ నంబర్ రిలీజ్ కానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్(Harika hasini creations) పై చినబాబు(Chinababu), సూర్యదేవర నాగవంశీ(Suryadevara nagavanshi) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతోంది.