ఇండియా నంబర్ వన్ హీరోయిన్..2024 తొలిహిట్ ఆమెదేనా?

ఇండియా నంబర్ వన్ హీరోయిన్..2024 తొలిహిట్ ఆమెదేనా?

ఇండియాలోనే నంబర్ వన్ హీరోయిన్గా దూసుకుపోతున్న దీపికా పదుకొనే (Deepika Padukone)..ఒక్కో సినిమాకి 15 కోట్ల పైనే రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఇండియాలో ఈ రేంజ్ రెమ్యునేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోయిన్ కూడా ఈమెనే.

ఇక 2023లో దీపిక షారుక్ ఖాన్ సరసన పఠాన్, జవాన్ వంటి సినిమాల్లో నటించి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. వీటిలో పఠాన్ 2023 జనవరి 25న విడుదలైంది. ఈ ఇయర్ బాలీవుడ్ లో ఫస్ట్ సక్సెస్ అందుకున్న సినిమా ఇదే. దాంతో 2023లో మొదటి బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్ అనిపించుకుంది దీపికా పదుకొనే. అయితే 2024 లో కూడా దీపిక ఇదే రిపీట్ చేయబోతోంది.

 

 

2024 ఆరంభంలో దీపికా పదుకొనే నటించిన సినిమానే బాక్స్ ఆఫీస్ వద్ద బోణి కొట్టబోతోంది. 2024 జనవరిలో బాక్సాఫీస్ వద్ద పలు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో బాలీవుడ్ నుంచి కొత్త ఏడాదిలో విడుదలవుతున్న మొదటి సినిమా 'ఫైటర్'. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న విడుదల కానుంది. ఈ సినిమాలో దీపిక పదుకొనే ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. 

ఫైటర్ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకుకున్నాయి. ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే మళ్లీ కొత్త ఏడాదిలో బాలీవుడ్ నుంచి తొలి హిట్ దీపిక పదుకొనే ఖాతాలోనే పడేట్లు కనిపిస్తోంది.