కాంస్యం సాధించిన గురుదీప్ సింగ్

 కాంస్యం సాధించిన గురుదీప్ సింగ్

కామన్వెల్త్ గేమ్స్లో భారత వెయిట్ లిఫ్టర్లు అదరగొడుతున్నారు. ప్రపంచ వేదికపై పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా గురుదీప్ సింగ్ 109 కేజీల విభాగంలో పతకాన్ని సాధించారు.  స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ కెటగిరీల్లో గురుదీప్ సింగ్ మొత్తం 390 కేజీలు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. 

స్నాచ్ కేటగిరీలో మొదటి ప్రయత్నంలో గురుదీప్ సింగ్ 167 కేజీలు ఎత్తడంలో ఫెయిల్ అయ్యాడు. రెండో ప్రయత్నంో అతను 167 కేజీలు ఎత్తాడు. ఫైనల్ అటెంప్ట్ లో  మరింత బరువును కలిపి 173 కిలోలు ఎత్తే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. దీంతో 167 కిలోల బరువుతో స్నాచ్ కేటగిరిని పూర్తి చేశాడు.

 

ఆ తర్వాత క్లీన్ అండ్ జర్క్ ఈవెంట్ లో గురుదీప్ సింగ్ సంచలన ప్రదర్శన చేశాడు.  మొదటి ప్రయత్నంలోనే ఏకంగా 207 కేజీలు ఎత్తాడు. రెండో ప్రయత్నంలో 215 కేజీలు ఎత్తేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. మూడో  ప్రయత్నంలో 223 కేజీలను సక్సెస్ ఫుల్ గా ఎత్తి..ఓవరాల్ గా 390 కేజీలు లిఫ్ చేసి మూడో స్థానంలో నిలిచాడు.

కాంస్య పతకం సాధించిన గురుదీప్ సింగ్ను ప్రధాని మోడీ అభినందించారు. కృషి, అంకితభావంకు గురుదీప్ సింగ్ ప్రదర్శన నిదర్శనమని కొనియాడారు.  CWG వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకోవడంలో గురుదీప్ సింగ్ తెగువ అమోఘమని మెచ్చుకున్నారు. దేశ పౌరుల్లో గురుదీప్ సింగ్ ఆనంద స్ఫూర్తిని నింపారని మోడీ ప్రశంసించారు.