కన్నుల పండుగగా గురునానక్ జయంతి ఉత్సవాలు

కన్నుల పండుగగా గురునానక్ జయంతి ఉత్సవాలు

సికింద్రాబాద్: గురునానక్ 553 వ జయంతి ఉత్సవాలు గురుద్వారాలో ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ లోని గురుద్వారా నుంచి  క్లాక్ టవర్ మీదుగా జయంతోత్సవ ర్యాలీ చేపట్టారు. గురుద్వారా అధ్యక్షుడు బలదేవ్ సింగ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ర్యాలీలో వివిధ రకాల వేషధారణలతో సిక్కులు చేసిన నృత్యాలు అలంకరణలు అందరిని ఆకట్టుకున్నాయి.

బ్యాండ్ చప్పుళ్ళు,గుర్రాలపై ఊరేగింపులు, కత్తిసాము, గురునానక్ జీవిత గాధను తెలియచేసే విధంగా ఏర్పాటు చేసిన తెరలు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి.

విద్యుత్ కాంతుల నడుమ, భజన సత్సంగ లతో గురునానక్ జయంతి కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా బలదేవ్ సింగ్ మాట్లాడారు. సిక్కుల మత గురువు గురునానక్ మహరాజ్ జీవితం సిక్కులకు ఆదర్శప్రాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిక్కులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.