ఇన్చార్జ్ ప్రిన్సిపల్ వద్దని మెట్పల్లిలో గురుకుల కాలేజీ స్టూడెంట్ల ఆందోళన

ఇన్చార్జ్ ప్రిన్సిపల్ వద్దని మెట్పల్లిలో గురుకుల కాలేజీ స్టూడెంట్ల ఆందోళన
  •     ఇన్​చార్జ్ ప్రిన్సిపాల్ వద్దని  గురుకుల కాలేజీ స్టూడెంట్ల ఆందోళన
  •     జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో హైవేపై ధర్నా 

కోరుట్ల,వెలుగు: జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్​ కాలేజీ ఇన్​చార్జ్ ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం స్టూడెంట్స్ నిరసనకు దిగారు. నేషనల్​హైవే పై స్టూడెంట్స్​ బైఠాయించి, ఇన్​చార్జ్  ప్రిన్సిపాల్ మాధురికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. అకారణంగా తమపై ప్రిన్సిపాల్ చేయి చేసుకుంటున్నారని, తిండి పెట్టడం కూడా దండగ అంటూ తిడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. 

వెంటనే ఇన్​చార్జ్ ప్రిన్సిపాల్ ను తొలగించాలని డిమాండ్ చేశారు.  పర్మినెంట్​ప్రిన్సిపాల్ ను నియమించాలని స్టూడెంట్స్, పేరెంట్స్​కోరారు. ధర్నాతో హైవే​పై  ట్రాఫిక్ ​నిలిచిపోయింది. పోలీసులు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. తహసీల్దార్ నీత, జోనల్​ ఆఫీసర్ పూర్ణచందర్​ వెళ్లి  విద్యార్థులకు ​న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.