గురుకుల సీట్లు పెంచాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య

గురుకుల సీట్లు పెంచాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీ గురుకుల సీట్లను పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య కోరారు. గురువారం ఆయన సీఎం రేవంత్​రెడ్డికి లేఖ రాశారు.  గురుకులాల్లో తమ పిల్లలకు సీట్లు కావాలని తల్లిదండ్రులు తెలుగు సంక్షేమ భవన్ చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో 100 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. ఈలోగా ప్రతీ పాఠశాలలో10 శాతం సీట్లు పెంచి, అదనంగా సెక్షన్లు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.