గురుకులు పాఠశాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎంపీ లక్ష్మణ్

గురుకులు పాఠశాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎంపీ లక్ష్మణ్

ఘట్​కేసర్, వెలుగు: ఘట్​కేసర్ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ చెప్పారు. ఆదివారం పట్టణంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్​లో సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి ఆధ్వర్యంలో  ఆత్మీయ సభ ఏర్పాటు చేసి లక్ష్మణ్ ను సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్​మాట్లాడుతూ.. ఘట్​కేసర్ లోని రైల్వే వంతెన, మైసమ్మ గుట్ట అండర్ పాస్ రోడ్డు పనులకు, గురుకులు పాఠశాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఘట్​కేసర్​ మండలానికి నవోదయ స్కూల్​తీసుకొచ్చేందుకు స్థానిక నాయకులు కలిసి రావాలన్నారు. 

రాజ్యసభ సభ్యునిగా తనకు వచ్చే నిధుల్లోని 15 శాతం నిధులను ఘట్​కేసర్​కోసం ఖర్చు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు నానావత్ భిక్కునాథ్ నాయక్, మాజీ ఎంపీపీలు బండారి దానుగౌడ్, శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు వెంకటరెడ్డి, రమాదేవి, ఆంజనేయులుగౌడ్, ఎంపీటీసీ శోభ, కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రె రాజేశ్, టీడీపీ అధ్యక్షుడు వేముల సంజీవగౌడ్, బీజేపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు హనుమాన్ పాల్గొన్నారు.