గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఉద్యోగుల అరెస్ట్

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఉద్యోగుల అరెస్ట్

వరంగల్​సిటీ, వెలుగు : దొంగతనం కేసులో గ్రేటర్​ వరంగల్​ కార్పొరేషన్​కు చెందిన ముగ్గురు ఉద్యోగులను గురువారం అరెస్టు చేసినట్లు మట్టేవాడ సీఐ తుమ్మ గోపి తెలిపారు. ఈనెల 15న 23 వ డివిజన్​ ఆటోనగర్​ బల్దియా కమ్యూనిటీ హాల్​ అవరణలో ఉన్న ఇనుప పైపులను అమ్ముకున్న ఘటనలో బల్దియాకు చెందిన సానిటరీ జవాన్లు శ్రవణ్

ఉస్మాన్​తోపాటు ట్రాక్టర్ డ్రైవర్ గణేశ్​ను  అరెస్టు చేశారు. సానిటరీ ఇన్​స్పెక్టర్​ ఎల్లస్వామి ఈ నెల 18న ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసట్టిన పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.