కార్డ్​ డిటెయిల్స్​ అమ్ముతారిలా

కార్డ్​ డిటెయిల్స్​ అమ్ముతారిలా

ఈ మధ్య హ్యాకర్స్​, ఫైనాన్షియల్​ స్కామ్​స్టర్స్​ క్రెడిట్​ కార్డ్​, డెబిట్​ కార్డ్ ఇన్ఫర్మేషన్​ కాజేస్తున్నారు. వీళ్లు ఆ ఇన్ఫర్మేషన్​ని డార్క్​వెబ్​లో అమ్మి, డబ్బులు సంపాదిస్తున్నారు. డార్క్​వెబ్​లో 2021లో 9 కోట్ల 60 లక్షలకు పైగా క్రెడిట్​ కార్డుల్ని అమ్మారని ఫ్లోరిడాకు చెందిన సైబర్​ సెక్యూరిటీ కంపెనీ ‘జెమిని అడ్వైజరీ’ చెప్పింది. దొంగిలించిన క్రెడిట్​ కార్డ్​, డెబిట్​ కార్డ్​ డిటెయిల్స్​ని డార్క్​ వెబ్​లో ‘కార్డింగ్​ ఫోరమ్స్’కి అమ్ముతారు హ్యాకర్లు. అంతేకాదు వెబ్​సైట్లని ఎలా హ్యాక్​ చేయాలి? దొంగిలించిన డేటా సాయంతో బ్యాంక్​ అకౌంట్లని ఎలా హ్యాక్​ చేయాలి? అనేది కూడా చెప్తారు.  

డాలర్లలో రేటు
‘కార్డింగ్​ ఫోరమ్స్​’ ఒక క్రెడిట్​ కార్డ్​ రికార్డుకి 14 నుంచి 30 డాలర్లు ఇస్తాయని ప్రైవసీ అఫైర్స్​.కామ్​ చెప్తోంది. ఆన్​లైన్​ బ్యాంకింగ్​ లాగిన్స్​ రికార్డ్​కి 40 డాలర్లు, ఫేస్​బుక్​ అకౌంట్లని హ్యాక్​ చేస్తే, 35 డాలర్లు ఇస్తారట. 

ట్వీట్స్​ ఫాలోవర్స్​కి మాత్రమే 
ట్విట్టర్​లో చాలామంది ఓపెన్​గా ఏ విషయం మీదైనా తమ ఒపీనియన్​ చెప్తారు. వాళ్ల ట్వీట్లు  అందరికీ కనిపించడం వల్ల కొన్నిసార్లు ట్రోలింగ్ బారిన పడతారు. అయితే, ఇప్పట్నుంచి యూజర్లు తమ ట్వీట్స్​ని ఫాలోవర్స్​ మాత్రమే చూసేలా చేయొచ్చు. అందుకు ట్విట్టర్​ కొత్త ఫీచర్ తీసు కొచ్చింది. అకౌంట్​ సెట్టింగ్స్​లోకి వెళ్లి ప్రైవసీ, సేఫ్టీ ఆప్షన్​పై క్లిక్​ చేయాలి. ఆడియెన్స్, ట్యాగింగ్​ ఆప్షన్​పై క్లిక్​ చేస్తే, ‘ప్రొటెక్ట్ యువర్​ ట్వీట్స్’ ఆప్షన్​ కనిపిస్తుంది. ఈ ఆప్షన్​ ఎంచుకుంటే ఇకపై ఫాలోవర్స్​ మాత్రమే ట్వీట్స్​ చూడగలుగుతారు. దీని కిందనే  ఫొటో ట్యాగింగ్​ ఆప్షన్ ఉంటుంది. దీనిలో ‘ఎవరైనా ట్యాగ్​ చేయొచ్చు’, ‘ఫాలో అయ్యేవాళ్లు మాత్రమే ట్యాగ్​ చేయొచ్చు’ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో రెండోది​ సెలక్ట్​ చేసుకుంటే ఎవరు పడితే వాళ్లు మీ ఫొటోల్ని ట్యాగ్​ చేయడం కుదరదు.