
ఇండియాలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో తమ ఐటీ సిస్టమ్స్ సైబర్ దాడికి గురయ్యాయని ఇటీవల ప్రకటించడం తెలిసిందే.ఈ దాడులు ఇక్కడితో ముగిసిపోలేదని, మరిన్నికంపెనీలు హ్యాకింగ్ బారిన పడ్డాయని నిపుణులు చెబుతున్నారు. కంపెనీలు మాత్రం ఈ వాదనతో విభేదిస్తున్నాయి. భద్రత పెంచామని ప్రకటించాయి. విప్రోతోపాటు ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, క్యాప్ జెమిని వంటి ప్రముఖ కంపెనీల ఈ–మెయిల్ సిస్టమ్స్ లక్ష్యంగా హ్యాకర్లు దాడులు జరిపారని క్రెబ్స్‌ఆన్ సెక్యూరిటీ వ్యవస్థాపకుడు బ్రియాన్ క్రెబ్స్ శుక్రవారం వెల్లడించారు. మీకు గిఫ్టులు వచ్చాయంటూ నెట్ యూజర్లను మోసం చేసే ముఠాలే ఇలా చేసి ఉండవచ్చని సైబర్ నిపుణులు భావిస్తున్నారు. గత నెల విప్రో కంప్యూటర్లను హ్యాక్ చేసిన వాళ్లే మిగతా కంపెనీలనూ లక్ష్యంచేసుకొని ఉండవచ్చని క్రెబ్స్ తన బ్లాగ్‌పోస్ట్‌లో ఆందోళన వ్యక్తం చేశారు.
విప్రోలో జరిగినట్టు తమసిస్టమ్స్‌పైనా హ్యాకర్లు దాడి చేసినట్టు క్యాప్ జెమిని ఇంటర్నల్ సెక్యూరిటీ సెంటర్ (ఎస్ ఓసీ) గుర్తించింది. గత నెల 4–19 తేదీల మధ్య అనుమానాస్పద పరిణామాలు సంభవించినట్టు తేల్చింది. వెంటనే రక్షణచర్యలు తీసుకొని ప్రమాదం నుంచి బయటపడింది .రష్యాలోని సర్వర్ల నుంచి ఇన్ఫోసిస్ సిస్టమ్స్ కూడా ఇలాంటి దాడులకు గురై ఉండవచ్చంటూ దాని ఇంటెలిజెన్స్ పార్ట్‌నర్స్ సమాచారం ఇచ్చాయి. దీంతో లోతైన విశ్లేషణ జరిపింది. తమ నెట్ వర్క్ పైన దాడి జరగలేదని ప్రకటించింది. ఫిషింగ్‌కు పాల్పడే డొమైన్లన్నీ రష్యాలోని బుల్లెట్ ప్రూఫ్ హోస్టింగ్ కంపెనీ కింగ్ సర్వర్స్ ఇంటర్నెట్ అడ్రస్ కు కనెక్ట్ అయినట్టు క్రెబ్స్ గుర్తించారు.దీని సబ్ డొమైన్లను పరిశీలిస్తే హ్యాకర్లు అమెరికారిటైల్ కంపెనీలు గ్రీన్‌డాట్, పేమెంట్ ప్రాసెసింగ్ కంపెనీ ఎలవన్, ర్యాక్‌స్పేస్, బిజినెస్ కన్సలింగ్ సంస్థ ఎవనడే, ఐటీ ప్రొవైడర్ పీసీఎం, ఫ్రెంచ్ కన్సల్టింగ్ కంపెనీ క్యాప్‌జెమిని వంటి వాటి సిస్టమ్స్‌పైనా దాడికి ప్రయత్నించి ఉంటాయని భావిస్తున్నారు. అటాకర్లందరూ కంపెనీల థర్డ్ పార్టీ వనరుల సమాచారం కోసం హ్యాకింగ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సమాచారం ద్వారా గిఫ్ట్‌కార్డ్ కుంభ కోణాలకుపాల్పడే అవకాశాలు ఉన్నాయి.