V6 News

రొమాంటిక్‌‌‌‌ లవ్‌‌‌‌ స్టోరీతో.. హై జవానీ తో ఇష్క్ హోనా హై

రొమాంటిక్‌‌‌‌ లవ్‌‌‌‌ స్టోరీతో.. హై జవానీ తో ఇష్క్ హోనా హై

వరుణ్ ధావన్‌‌‌‌, పూజాహెగ్డే, మృణాల్ ఠాకూర్‌‌‌‌‌‌‌‌  లీడ్ రోల్స్‌‌‌‌లో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’. డేవిడ్ ధావన్ ద‌‌‌‌ర్శక‌‌‌‌త్వం వ‌‌‌‌హిస్తున్నారు. రమేష్ తౌరాణి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసిన మేకర్స్.. శుక్రవారం ‘వ్యాహ్ కర్వాదో జీ’ అనే పాటను విడుదల చేశారు. వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌‌‌‌ నేపథ్యంలో కలర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ సెట్స్‌‌‌‌లో చిత్రీకరించిన ఈ పాటలో వరుణ్​ ధావన్‌‌‌‌ డాన్స్ మూమెంట్స్‌‌‌‌, మృణాల్ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ గ్లామర్‌‌‌‌‌‌‌‌ ఇంప్రెస్‌‌‌‌ చేశాయి. 

ఈ హై ఎనర్జీ డాన్స్‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌లో హీరోహీరోయిన్స్‌‌‌‌ ఆన్‌‌‌‌ స్క్రీన్‌‌‌‌ కెమిస్ట్రీ హైలైట్‌‌‌‌గా నిలిచింది.  వెడ్డింగ్‌‌‌‌ ఆంథమ్‌‌‌‌గా,  సంగీత్ ప్లే లిస్ట్‌‌‌‌లో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో ఈ పాట నిలుస్తుందని మేకర్స్‌‌‌‌ చెబుతున్నారు. మే 22న సినిమా విడుదల కానుంది. ఇటీవల ‘డెకాయిట్‌‌‌‌’ లాంటి ఇంటెన్స్‌‌‌‌ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మృణాల్.. వచ్చే నెలలో రొమాంటిక్‌‌‌‌ లవ్ స్టోరీతో ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేయబోతోంది.