జుట్టు బలంగా ఉండి నల్లగా మెరిసిపోవాలంటే..

జుట్టు బలంగా ఉండి నల్లగా మెరిసిపోవాలంటే..

వెంట్రుకల కొసలు చిట్లిపోవడం, జుట్టు ఊడిపోవడం వంటివి చాలామంది మహిళల్ని ఇబ్బంది పెడతాయి.  కొన్ని రకాల ప్రొటీన్లు, విటమిన్లు లోపించడం వల్ల జుట్టు బలహీనం అవుతుంది. దాంతో వెంట్రుకల కొసలు చిట్లిపోవడం, జుట్టు రాలడం మొదలవుతుంది. జుట్టు  కుదుళ్ల నుండి బలంగా ఉండి, నల్లగా మెరిసిపోవాలంటే...
విటమిన్– సి ఉండే నిమ్మజాతి పండ్లు తింటే దెబ్బతిన్న వెంట్రుకల కుదుళ్లు రిపేర్‌‌ అవుతాయి.  విటమిన్– బి6, బి12 జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. నియాసిన్‌ 
(విటమిన్–బి3) ఎక్కువగా ఉండే మాంసం, పాల ఉత్పత్తులు, పప్పులు తింటే  కుదుళ్లకు పోషకాలు అందుతాయి. బయోటిన్ లభించే గుడ్డు, చిక్కుడు జాతి గింజలు, నట్స్ వంటివి  కెరటిన్‌ ప్రొటీన్ ఉత్పత్తిని పెంచుతాయి. జుట్టు బలంగా పెరగడానికి కెరటిన్ ఉపయోగపడుతుంది.