మోహన్‌బాబు, మంచు విష్ణుపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు

మోహన్‌బాబు, మంచు విష్ణుపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు

హెయిర్‌ స్టయిలిస్ట్‌ నాగశ్రీను వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. మోహన్ బాబు, మా అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణులపై నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వారు కర్నూలులోని మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. కులం పేరుతో దూషించారని మోహన్ బాబు, హీరో విష్ణుపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. మోహన్‌బాబు కుటుంబం త‌మ మ‌నోభావాల‌ను దెబ్బ తీసింద‌ని, త‌క్షణ‌మే క్షమాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నాయి నాయీ బ్రాహ్మణ సంఘాలు. ఇటీవల సన్‌ ఆఫ్‌ ఇండియా చిత్రంపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారన్న కారణంగా నాగశ్రీనును ఇంట్లో పనివాళ్ల ముందు మోకాళ్లపై కూర్చోబెట్టి దుర్భాషలాడారని ఆరోపించారు. రూ.5 లక్షల విలువైన హెయిర్‌ డ్రెస్సింగ్‌ సామాగ్రిని చోరీ చేశాడని అక్రమ కేసులు బనాయించారన్నారు. మోహన్ బాబు, అతడి కుమారుడు మంచు విష్ణు నాయీ బ్రాహ్మణులకు, బీసీ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం

 

లండన్ నుంచి భారత్కు.. సద్గురు బైక్ యాత్ర

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్ డేట్స్