
ఓయూ, వెలుగు : ఆలిండియా స్టూడెంట్బ్లాక్ (ఏఐఎస్‌బీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హకీమ్ నవీద్‌ను మంగళవారం సిటీలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నవీద్ మాట్లాడుతూ.. నేతాజీ ఆలోచన విధానాన్ని పాటిస్తూ సోషలిజం సాధనకు
విద్యారంగ సమస్యలపై పోరాడతానని తెలిపారు. ఏఐఎస్‌బీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు ఆలిండియా స్టూడెంట్ బ్లాక్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి బండా సురేందర్ రెడ్డికి నవీద్ ధన్యవాదాలు తెలిపారు