ప్రతి ఆస్పత్రిలో సగం బెడ్లు ఆరోగ్యశ్రీకి కేటాయించాలి

ప్రతి ఆస్పత్రిలో సగం బెడ్లు ఆరోగ్యశ్రీకి కేటాయించాలి
  • బ్లాక్ ఫంగస్ కు వైద్యం నిరాకరించే ఆస్పత్రులపై కఠిన చర్య
  • ఏపీ మంత్రుల కమిటీ ఆదేశం

అమరావతి: రాష్ట్రంలోని ప్రతి ఆస్పత్రిలో సగం బెడ్లు ఆరోగ్యశ్రీ కింద వైద్యం కోసం వచ్చే వారికి కేటాయించాలని ఏపీ మంత్రుల కమిటీ సమావేశం ఆదేశించింది. అలాగే బ్లాక్ ఫంగస్ కు వైద్యం నిరాకరించే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రుల కమిటీ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నియంత్రణ, బ్లాక్ ఫంగస్ నివారణకు తీసుకోవలసిన చర్యలు, వ్యాక్సిన్, ఆక్సిజన్ బెడ్స్.. తదితర అంశాలపై గ్రూప్ అఫ్ మినిస్టర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
మంత్రుల సమావేశం నిర్ణయాలు:
ప్రతి ఆసుపత్రిలో సగం బెడ్లు ఆరోగ్యయశ్రీ కింద చికిత్సకు వచ్చే వారికి కేటాయించాలి.
ప్రవేట్ హాస్పిటల్స్ లో కచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు అమలు జరగాలి.

ఆక్సిజన్ వినియోగంపై ఎప్పటికప్పుడు ఆడిట్ జరగాలి.

ప్రతి హాస్పిటల్ లో కరోనా పెషేంట్స్ కు ఆక్సిజన్ నిల్వలు సక్రమంగా ఉండేలా చూడాలి.

రెమిడీసివర్ ఇంజక్షన్స్ బ్లాక్ లో విక్రయిస్తే కఠినంగా వ్యవహారించాలి.

ఈ ఇంజక్షన్స్ అన్ని హాస్పిటల్స్ లో అందుబాటులో ఉంచాలి.

బ్లాక్ ఫంగస్ పై ప్రజల్లో భయం పోగొట్టడానికి ప్రత్యేకంగా అవగాహన కల్పించాలి.
బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిన రోగులకు వైద్యం నిరాకరించే హాస్పిటల్స్ పై కఠినంగా వ్యవహారించాలని కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయించారు.
అధిక చార్జీలు వసూలు చేస్తున్న హాస్పిటల్స్ పై చర్యలకు వెనుకాడవద్దని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి అదేశించారని కూడా మంత్రుల కమిటీ వెల్లడించింది.