ఈ ఏడాది హిట్ కొట్టిన టాప్ 10 హీరోస్

ఈ ఏడాది హిట్ కొట్టిన టాప్ 10 హీరోస్

ఈ 2022 సంవత్సరంలో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు కురిపించాయి. అందులో చిన్న సినిమాలు, ఊహంచని విధంగా హిట్ లిస్ట్ లో చేరిన సినిమాలూ ఉన్నాయి. వాటిలో ఈ ఏడాది ది బెస్ట్ అండ్ బాక్సాఫీస్ వద్ద హిట్ లను అందించిన నటుల గురించి తెలుసుకుందామా...

యశ్

కేజీఎఫ్ ముందు వరకూ చిన్న హీరోగా తెలిసిన వ్యక్తి.. అకస్మాత్తుగా.. కేవలం ఒకే ఒక్క సినిమాతో భారతీయ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాక, అన్ని భాషల చిత్ర పరిశ్రమల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ ఏడాది కేజీఎఫ్ చాప్టర్ 1కు సీక్వెల్ గా వచ్చిన KGF చాప్టర్ 2 కూడా మంచి విజయం సాధించి దేశీయంగా దాదాపు రూ. 1,000 కోట్ల వ్యాపారాన్ని సాధించింది. అంతే కాదు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1,200 కోట్లకు పైగా (గ్రాస్) వసూలు చేసింది. 

 రామ్ చరణ్ 

2022లో రెండో బిగ్గెస్ట్ హిట్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అందించారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్.. దేశీయంగా దాదాపు రూ.944 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.1,130 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. అంతే కాదు ఈ చిత్రం రెండు గోల్డెన్ గ్లోబ్ నామినేషన్లను కూడా సంపాదించింది.

జూనియర్ ఎన్టీఆర్ 

ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ గురించి చెప్పినపుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎలా మాట్లాడకుండా ఉంటాం? ఎన్టీఆర్ కూడా తన అద్భుతమైన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. కాగా ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి చేసిన నాటు నాటు పాటకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆ పాటలో వారిద్దరూ కలిసి చేసిన స్టెప్పులే.. మూవీకి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు.

విక్రమ్

విక్రమ్.. తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఒకరు. డైరెక్టర్ మణిరత్నం యొక్క మాగ్నమ్-ఓపస్ 'PS - 1' లో విక్రమ్ తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించి, అలరించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం దాదాపు రూ.500 కోట్ల రూపాయలు (ప్రపంచవ్యాప్తంగా గ్రాస్) సంపాదించింది. 

కమల్ హాసన్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ సినిమాలంటే తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు అంతే ఆసక్తిగా ఎదురు చూస్తారు. అంత గొప్ప నటుడైన కమల్ హాసన్ ఈ ఏడాది రిలీజైన విక్రమ్ లో మరోసారి తన విశ్వరూపం చూపించారు. కథ చిన్నదే అయినా.. దాన్ని అల్లుకున్న విధానం ఆకట్టుకోవడం అన్ని ప్రాంతాల్లోనూ ఆయన ఫ్యాన్స్ తో పాటు, సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరించారు. అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్ల బిజినెస్ చేసిన చిత్రంగానూ నిలిచింది.

రణబీర్ కపూర్

రణబీర్ ఈ సంవత్సరం 'బ్రహ్మస్తా: పార్ట్ 1 శివ'తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. వరుస వైఫల్యాలు, బాయ్‌కాట్‌ పిలుపుల మధ్య ఈ సినిమా రిలీజైనా.. మొత్తానికి బ్లాక్ బస్టర్ మూవీస్ జాబితాలో చేరిపోయింది. ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా (గ్రాస్) వసూలు చేసింది.

కార్తీక్ ఆర్యన్

భూల్ భూలయ్యా 2, ఫ్రెడ్డీ అనే రెండు మెగా హిట్‌లను అందించిన కార్తీక్ ఆర్యన్‌కి 2022 గొప్ప సంవత్సరంగా నిలిచింది. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు ఈ ఇయర్ చాలా కలిసొచ్చిందనే చెప్పొచ్చు. ఇక భూల్ భూలయ్యా 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 260 కోట్లు + రాబట్టిగా..  ఫ్రెడ్డీ OTTలో రిలీజై అనూహ్యమైన వ్యూస్ ను సొంతం చేసుకుంది. 

అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి

మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ 2022లో అతిపెద్ద హిట్‌ను కొట్టారు. 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమాతో గొప్ప గుర్తింపును సొంతం చేసుకున్నారు. బాక్సాఫీస్ గణాంకాలను రీక్రియెట్ చేసి,- ప్రపంచవ్యాప్తంగా రూ. 344 కోట్లు రాబట్టిన సినిమాగా ఈ చిత్రం నిలిచింది.

అజయ్ దేవగన్

అజయ్ దేవగన్ నటించిన 'దృశ్యం 2' అంచనాలను అధిగమించి, హిట్ లిస్ట్ లో చేరింది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.298 కోట్లు రాబట్టగా.. ఈ మూవీ ఇంకా కొన్ని థియేటర్లలో ప్రదర్శించబడడం విశేషం. 

రిషబ్ శెట్టి

కన్నడ రిషబ్ శెట్టి న స్వంత దర్శకత్వం వహించిన 'కాంతారా'లో తానే హీరోగానూ నటించి, పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకున్నాడు. భూతకోల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు అనూహ్య స్పందన రావడమే గాక.. విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. కాగా దాదాపు రూ.15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.390+ కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది.