సెకండ్ బ్యాచ్ లో 17మంది ఇజ్రాయెలీ బందీల విడుదల

సెకండ్ బ్యాచ్ లో 17మంది ఇజ్రాయెలీ బందీల విడుదల

హమాస్ లో బందీగా ఉన్న 17మంది ఇజ్రాయెలీలను కొద్ది గంటల ఆలస్యంతో విడుదల చేశారు. 14 మంది ఇజ్రాయెలీలు, నలుగురు థాయ్ పౌరులు సహా 17 మంది ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. వీరిని రఫా సరిహద్దుల వద్ద అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీకి అప్పగిస్తున్న ఓ ఫుటేజ్ ప్రస్తుతం స్థానిక మీడియాలో ప్రసారం అవుతున్నట్టు సమాచారం. తాజాగా విడుదలైన ఇజ్రాయెలీ పౌరుల్లో ఆరుగురు మహిళలు, ఏడుగురు చిన్నారులు, ఓ టీనేజర్ ఉన్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది.

తొలి విడతలో నవంబర్ 24న 24 మందికి హమాస్‌ విముక్తి కల్పించగా.. ఇజ్రాయెల్‌ జైలు నుంచి 39 మంది పాలస్తీనా పౌరుల్ని విడుదల చేసింది. బందీలకు ప్రస్తుతం స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బందీలు కోలుకుంటున్నారని, వారిని కుటుంబాలకు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. అయితే, రెండో దశలో నవంబర్ 25న 14 మందిని హమాస్.. ఇజ్రాయెల్‌ 40 మందికిపైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాల్సి ఉంది.