బ్రెయిన్ డెడ్తో లండన్లో హనుమకొండ యువకుడు మృతి

 బ్రెయిన్ డెడ్తో లండన్లో  హనుమకొండ యువకుడు మృతి

బ్రెయిన్ డెడ్ తో లండన్ లో  తెలంగాణ యువకుడు మృతి చెందాడు.  హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం బైరాన్‌పల్లికి చెందిన రేమిడి రాహుల్‌రెడ్డి (32)  బ్రెయిన్‌ డెడ్‌తో మృతి చెందాడు.

 మూడేళ్ల క్రితం చదువు కోసం లండన్‌కు వెళ్లిన రాహుల్..  పార్ట్‌ టైం జాబ్‌ చేస్తూ చదువుకుంటున్నాడు.   నెల రోజుల క్రితం గుండె సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మే 27న  మృతి చెందాడు. మృతుడి తల్లి ఏడేళ్ల క్రితమే గుండెపోటుతో మృతి చెందింది.