
హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ ఫ్యాషన్ రిటైలర్ హెచ్ అండ్ ఎం ఇండియా హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌లో 2012 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న తన హెచ్ అండ్ ఎం స్టోర్లో హోమ్ కలెక్షన్ను ప్రారంభించింది. హోమ్ కాన్సెప్ట్ ద్వారా ప్రీమియం బెడ్ లినెన్‌లు, డిన్నర్‌వేర్, గృహాలంకరణ వస్తువులను అందిస్తున్నారు. ధరలు రూ. 149 నుంచి మొదలవుతాయని హెచ్అండ్ఎం ఇండియా కంట్రీ సేల్స్ మేనేజర్ యానిరా రామిరేజ్ అన్నారు. సమ్మర్ కలెక్షన్కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు.