శాయంపేట, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న 28 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని గురువారం పోలీసులు పట్టుకున్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలం కామారం గ్రామానికి చెందిన తక్కళ్లపెల్లి చిరంజీవి ఒక ట్రక్కులో శాయంపేట మండలం మైలారం గ్రామశివారు నుంచి 28 క్వింటాళ్ల బియ్యాన్ని తరిస్తుండగా పెట్రోలింగ్ చేస్తున్న ఎస్సై పరమేశ్వర్ పట్టుకున్నారు. వాహనంతో పాటు అతనిపై కేసునమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
