గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబేపై పొలిటికల్ వెబ్ సిరీస్

గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబేపై పొలిటికల్ వెబ్ సిరీస్

ముంబై: ఫిల్మ్‌మేకర్ హన్సల్ మెహతా ఓ ఆసక్తికర వెబ్‌ సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఉత్తర్‌‌ప్రదేశ్‌లో పోలీసుల ఎన్‌కౌంటర్‌‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేపై ఈ సిరీస్ తీయనుండటం హాట్ టాపిక్‌గా మారింది. కర్మా మీడియా అండ్ ఎంటర్‌‌టైన్‌మెంట్ సంస్థలో పోలరాయిడ్ మీడియా భాగస్వామ్యంతో శైలేష్ ఆర్‌ సింగ్ ఈ మూవీని నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన రైట్స్‌ను శైలేష్ దక్కించుకున్నారు. ఈయన తను వెడ్స్ మను, షాహిద్, అలీగఢ్, ఒమెర్తా, జడ్జిమెంట్ హై క్యా లాంటి మూవీస్‌కు నిర్మాతగా వ్యవహరించారు.

వెబ్‌ సిరీస్ దర్శకుడి విషయానికొస్తే అలీగఢ్, ఒమెర్తా సినిమాలను తీసిన మెహతా.. రాజ్‌కుమార్ రావ్‌తో షాహిద్ అనే నేషనల్ అవార్డ్‌ విన్నింగ్ ఫిల్మ్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజా వెబ్ సిరీస్‌ను బాధ్యతతో తీస్తానని మెహతా అన్నాడు. ‘రాజకీయాలు, క్రైమ్, నేతలు ఒక్కటై సాగుతున్న ప్రస్తుత కాలానికి, మన వ్యవస్థలను ఇది ప్రతిబింబిస్తుంది. దీంట్లో మంచి పొలిటికల్ థ్రిల్లర్‌‌ నాకు కనిపించింది. ఈ కథను చెప్పడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది’ అని మెహతా చెప్పాడు.