థ్రిల్‌‌‌‌ చేసే శృతి

థ్రిల్‌‌‌‌ చేసే శృతి

వరుస లేడీ ఓరియెంటెడ్‌‌‌‌ మూవీస్‌‌‌‌ చేస్తున్న హన్సిక తెలుగులో ‘మై నేమ్‌‌‌‌ ఈజ్‌‌‌‌ శృతి’ అనే క్రైమ్‌‌‌‌ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌లో నటిస్తోంది. ‘ద హిడెన్‌‌‌‌ ట్రూత్‌‌‌‌’ అనేది క్యాప్షన్. డి.శ్రీనివాస్‌‌‌‌ ఓంకార్‌‌‌‌ దర్శకుడు. బురుగు రమ్య ప్రభాకర్ నిర్మాత. ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ను నిన్న ప్రసాద్‌‌‌‌ ల్యాబ్స్‌‌‌‌లో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌‌‌‌ లాంచ్ చేశారు. ఆయన మాట్లాడుతూ ‘టీజర్ బాగుంది, సినిమా సక్సెస్‌‌‌‌ అవుతుందనే నమ్మకం కలుగుతోంది. ఇలాంటి టాలెంట్ ఉన్న కొత్త తరం నటీనటులు, టెక్నీషియన్స్ ఇండస్ట్రీకి ఇంకా రావాలి. ఇండస్ట్రీ అభివృద్ది కోసం టికెట్ రేట్స్ కూడా పెంచాం. చిన్న, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలను దృష్టిలో ఉంచుకుని ఐదు షోలకు అనుమతి కూడా ఇచ్చాం’ అన్నారు. ‘ఈ ఇయర్‌‌‌‌‌‌‌‌ విడుదలవుతున్న నా ఫస్ట్ మూవీ ఇదే. ప్రేక్షకులకు తప్పక నచ్చుతుంది’ అంది హన్సిక. దర్శకుడు మాట్లాడుతూ ‘ఆర్గన్ మాఫియా బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో సాగే టిపికల్‌‌‌‌ స్టోరీ. ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుంది’ అన్నాడు. ఓ యువతి సమస్యలను ఎదుర్కొని ఎలా నిలబడిందనేది దర్శకుడు చాలా బాగా తీశాడన్నారు నిర్మాత.