మానవాళి మనుగడకోసం హనుమాన్ ఆగమనం.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్

మానవాళి మనుగడకోసం హనుమాన్ ఆగమనం.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma) తెరకెక్కిస్తున్న ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ హనుమాన్(HanuMan). మొట్టమొదటి ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీలో యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటిస్తుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. దానికి కారణం ప్రశాంత్ వర్మపై ఆడియన్స్ కి ఉన్న నమ్మకం. ఆ కారణంగానే హనుమాన్ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఉండటంతో.. ఆ అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఓపెనింగ్స్ షాట్ నుంచే ఆడియన్స్ కు మెస్మరైజ్ ఫీల్ ఇచ్చింది ఈ ట్రైలర్. ఇక సూపర్ హీరోగా తేజ సజ్జా అదరగొట్టేశాడు. యాక్షన్ సీక్వెన్సెస్ గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఒక నెగటివ్ ఫోర్స్… ఫెర్మిడబుల్ ఫోర్స్ కోసం వెతకడం, ఆ వేటలో వారికి అంజనాద్రి గురించి తెలియడం, అక్కడ వారికి హను మాన్ ఎదురవ్వడం, వారి మధ్య పోరాట సన్నివేశాలు వంటివి ఈ ట్రైలర్ లో చూపించారు. ఇక చివర్లో వచ్చిన హనుమాన్ సీన్ అయితే మైండ్ బ్లాక్ చేసింది. సరిగా అక్కడితో ట్రైలర్ ను ముగ్గించి సినిమాపై అంచనాలు పెంచేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. 

ఇవన్నీ చూస్తుంటే.. హను మాన్ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ అండ్ పాత్ బ్రేకింగ్ సినిమా అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తోంది. ఓవరాల్ గా ఆడియన్స్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక హను మాన్ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.