హనుమాన్ డైరెక్టర్ తో రవితేజ మూవీ.!

హనుమాన్ డైరెక్టర్ తో రవితేజ  మూవీ.!

 

స్పీడ్‌‌‌‌‌‌‌‌గా సినిమాలు చేసే హీరోల్లో రవితేజ ముందు వరుసలో ఉంటాడు.  అలాగే  యంగ్ డైరెక్టర్స్‌‌‌‌‌‌‌‌కు అవకాశాలు ఇచ్చే హీరోల్లోనూ టాప్‌‌‌‌‌‌‌‌లో ఉంటాడు.  ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో  ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో పాటు భాను భోగవరపు డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్‌‌‌‌‌‌‌‌తో బిజీగా ఉన్న రవితేజ.. తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. 

 ‘హనుమాన్’తో సూపర్ సక్సెస్‌‌‌‌‌‌‌‌ను అందుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటించనున్నాడట. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా ప్రశాంత్ చెప్పిన కథకు రవితేజ ఇంప్రెస్ అయ్యాడని, వెంటనే ఈ చిత్రానికి ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది. ‘హనుమాన్’ సినిమాలో కోతికి రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రశాంత్ చెప్పింది ‘హనుమాన్2 ’ కథ అని కొందరు అంటుంటే, దానికి సంబంధం లేదని, ఇదొక మాస్ స్టోరీ అని మరికొందరు చెబుతున్నారు. ఈ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.