ఏప్రిల్​23 హనుమత్​జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....

ఏప్రిల్​23  హనుమత్​జయంతి..ఆ రోజు  ఏ రాశివారు ఏం చేయాలంటే....

 హనుమంతుడు శ్రీరామునికి  అమితమైన భక్తుడు .. అత్యంత బలవంతుడు.  ఆంజనేయ స్వామిని అర్చిస్తే ఈతి బాధలు తొలగుతాయని హిందువు నమ్ముతుంటారు.  హనుమంతుని అనుగ్రహం పొందాలంటే రామ నామాన్ని జపిస్తే చాలు అని చెబుతారు. చాలా మంది హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండి హనుమంతుడిని పూజిస్తారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం  ఆంజనేయస్వామి  అనుగ్రహం పొందాలంటే...  హనుమాన్ జయంతి నాడు  ఏ రాశి వారు ఏమి చేయాలో తెలుసుకుందాం. . .

హనుమాన్ జయంతి హిందూ మతంలో చాలా ముఖ్యమైన పండుగ. హనుమంతుడు చైత్ర మాసంలో పూర్ణిమ రోజున జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది(2024) చైత్ర మాసంలో పూర్ణిమ ఏప్రిల్​ 23 న హనుమత్ జయంతి జరుపుకుంటారు. 

also read : హనుమత్​ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..

 మేషరాశి..వృశ్చిక రాశి :  ఈ రాశుల వారికి కుజుడు అధిపతి . కాబట్టి ఈ రాశుల వారు ఆంజనేయస్వామిని తమలపాకులతో పూజించాలి. అష్టోత్తర పూజ చేసిన తరువాత .. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి.  అయితే ఈ రాశుల వారు ఆంజనేయస్వామికి  లడ్డూలు నివేదించాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహంతో మీకు ఇప్పటి వరకు ఉన్న  సమస్యలు తొలగి పురోగతి కలిగేలా స్వామి వారు అనుగ్రహిస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

వృషభ రాశి ... తులా రాశి: .. :  ఈ రాశుల వారికి అధిపతి శుక్రుడు. వీరు హనుమత్​ జయంతి రోజున ఆంజనేయ స్వామికి తులసి మాల సమర్పించాలని పండితులు అంటున్నారు. ఈ రాశివారు హనుమంతునికి తులసి మాల సమర్పించి .. సింధూరాన్ని సమర్పించాలి. షోడశోపచార పూజ చేసిన తరువాత స్వామికి   మోతీచూర్ లడ్డూలను ( చిన్న లడ్డూలు) నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అంజనా పుత్రుడైన హనుమంతుడు....  సుఖ సంతోషాలను ప్రసాదించి.. కష్టాలను తొలగేలా... స్వామివారు అనుగ్రహిస్తారని పండితులు చెబుతున్నారు. 

మిథున రాశి ...  కన్యా రాశి :  ఈ రాశుల వారికి బుధుడు అధిపతి .  హనుమత్​ జయంతి రోజున హనుమాన్​ చాలీసా 108 సార్లు చదివి.. స్వామిని అష్టోత్తరంతో పూజించి..  హనుమంతుడికి  తీపిపదార్దాన్ని ( అప్పాలు)  నైవేద్యంగా పెట్టి పూజించాలి. అప్పాల దండను (108) స్వామికి సమర్పిస్తే చాలా మంచిది.  ఇలా చేయడం వల్ల హనుమంతుని ఆశీర్వాదం లభించి మీకు అన్ని పనుల్లో  విజయం చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

కర్కాటక రాశి:  కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ రాశి వారు  హనుమంతుడికి ఆకు పూజ చేయడం  వలన  ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందగలరు. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను స్వామికి నైవేద్యంగా సమర్పించాలి.  ఇలా చేయడం వల్ల జీవితం శాంతి, సంతోషాలను స్వామివారు కలుగజేస్తారు. 

 సింహ రాశి : సూర్యుడు సింహ రాశికి అధిపతి. హనుమంతుని అనుగ్రహం పొందాలంటే హనుమత్​ జయంతి రోజున స్వామిని  సింధూరంతో పూజించి హనుమాన్​ చాలీసాను 11 సార్లు చదవాలి. ..దీనితో పాటు హనుమాన్ అష్టోత్రాన్ని పఠించాలి.  జిలేబీ వంటి తీపి పదార్థాలను స్వామివారికి సమర్పించాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మీరు  ఇబ్బంది పడుతున్న  ప్రతికూల శక్తులు తొలగి... మీరు ప్రతి పనిలోనూ ఆంజనేయస్వామి అనుగ్రహం వల్ల  విజయం .. పురోగతిని పొందుతారు.

 ధనుస్సురాశి .. మీనరాశి :  ఈ రాశులకు బృహస్పతి అధిపతి.  ఈ రాశులలో జన్మించిన వారు హనుమత్​ జయంతి రోజు స్వామికి లవంగాలతో తయారు చేసిన ప్రసాదాన్ని సమర్పించాలి.  వీరు ఆంజనేయ స్వామి దేవాలయంలో 108 ప్రదక్షిణాలు చేయాలి.  ఇలా చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహం పొందుతారని పండితులు అంటున్నారు.ఆంజనేయస్వామి ఆశీస్సులతో ఈరాశుల వారు ఇప్పటి వరకు పడుతున్న ఇబ్బందులు తొలగి.. సమస్యలు పరిష్కారం అవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

మకరరాశి ... కుంభ రాశి : ఈ రాశులకు శని అధిపతి.  ఈ రాశి వారు  ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించి.. ఆకుపూజ చేయాలి. 108 తమల పాకులతో దండ తయారు స్వామి వారికి సమర్పించాలి. హనుమాన్​ చాలీసా 11 సార్లు చదివి.. అష్టత్తర నామాలతో పూజ చేయాలి.  ఆ తరువాత  మోతీచూర్ లడ్డూలను స్వామికి నివేదించాలి. ఇలా చేస్తే హనుమంతుని అనుగ్రహం లభిస్తుంది. శని ప్రభావం కొద్దిగా తగ్గుతుంది. అలాగే హనుమంతుడు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు.