
భద్రాచలం, వెలుగు : హనుమజ్జయంతికి భద్రాచలం శ్రీరామదివ్యక్షేత్రం సిద్ధమైంది. భక్తులకు సకల ఏర్పాట్లు చేస్తూ ఈవో రమాదేవి చర్యలు తీసుకున్నారు. అదనంగా ప్రసాదాల కౌంటర్లను నిర్మించారు. ప్రస్తుతం తూర్పుమెట్ల వద్ద నాలుగు లడ్డూ ప్రసాదాల కౌంటర్లు ఉన్నాయి. హనుమత్జయంతి సందర్భంగా భక్తులు వేల సంఖ్యల్లో వస్తారనే సమాచారంతో ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
అభయాంజనేయస్వామి ఆలయం వద్ద రెండు, పడమర మెట్ల వద్ద రెండు, మిథిలాస్టేడియంలో నాలుగు ప్రసాదాల కౌంటర్లను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. భక్తులకు దర్శనం ఫ్రీగా జరిగేలా సిబ్బందికి సూచనలు చేశారు. రామాలయంలో బుధవారం ఉదయం ప్రాకార మండపంలో ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. నిత్య కల్యాణం జరిగింది. సాయంత్రం దర్బారు సేవ జరిపారు.
విరాళాల వెల్లువ
భద్రాచలం సీతారామచంద్రస్వామికి బుధవారం భక్తుల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం పైడికొండపాలెం గ్రామానికి చెందిన తాళ్లూరి శ్రీయ,
దత్త దంపతులు నిత్యాన్నదాన పథకానికి రూ.2.50లక్షలు, వైజాగ్‌లోని మధురానగర్‌కు చెందిన గవిరెడ్డి కస్తూరి, నాయుడు దంపతులు రూ.లక్ష,వైజాగ్‌లోని విజేత సూపర్‌మార్కెట్ రోడ్డులోని గుబ్బల సురేంద్రనాథ్, అనురాధ దంపతులు రూ.లక్ష విరాళాలు ఈవో రమాదేవికి అందజేశారు.