
కామెడీకి కమర్షియ ల్ టచ్ను జోడించి ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ ను సొంతం చేసుకున్న డైరెక్టర్ శ్రీను వైట్ల (Srinuvaitla). హీరో గోపీచంద్ (Gopichand) తో కామిక్ ఎంటర్ టైనర్ లో సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా షూటింగ్ ఇటలీలోని (Italy) మాంటెరాలో ప్రారంభంకానుంది.ఇవాళ (సెప్టెంబర్ 24న) శ్రీనువైట్ల పుట్టినరోజు సందర్భంగా సినిమా లొకేషన్స్‌కు సంబంధించి గోపీచంద్ ఓ వీడియోను షేర్ చేశారు. ఎంతో ఇంటెన్సివ్ గా చూపించిన ఈ వీడియో..ఇంట్రెస్టింగ్ లోకేషన్స్ లో సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది.
ఈ మూవీని చిత్రాలయం స్టూడియోస్ ప్రొడక్షన్ నెం.1పై వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. త్వరలో టెక్నికల్ టీం వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. శ్రీనువైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ప్రముఖ రచయిత గోపి మోహన్ కథ అందిస్తున్నాడు. చైతన్య భరద్వాజ్(Chaitanya Bharadwaj) మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.
టాలీవుడ్ లో ఉన్న యాక్షన్ హీరోలల్లో ఒకరైన గోపిచంద్(Gopichand)..మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకొని కెరీర్లో దూసుకుపోతున్నారు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ తన హవా కొనసాగిస్తూన్నారు. ఇక లేటెస్ట్ గా ఈ మూవీకు టైటిల్ కూడా ఫిక్స్ చేశారని సమాచారం. అలాగే గోపీచంద్ హిట్ మూవీస్ ఎక్కువగా మూడు అక్షరాలు ఉండటంతో..విశ్వమ్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక శ్రీను వైట్ల మూవీస్ కూడా మూడు అక్షరాలతో హిట్ కొట్టాయి. ఇక వీరిద్దరి సెంటిమెంట్ కు తగ్గ ఫలితం వస్తోందని గట్టి నమ్మకంతో మూవీ స్టార్ట్ చేయనున్నట్లు టాక్.
కాగా శ్రీను వైట్ల ఆగడు,మిస్టర్,అమర్ అక్బర్ ఆంటోని వంటి మూవీస్ తో భారీ డిజాస్టర్స్ తెచ్చుకున్నారు. దీంతో చాలా కాలం నుంచి మూవీస్ కు దూరంగా ఉంటూ..ఇక ఆయనకు సెట్ అయ్యే జోనర్ లోనే అద్దిరిపోయే కథ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరి కలయికలో వస్తోన్న మూవీ కోసం ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తారో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్.
ప్రస్తుతం గోపీచంద్ కన్నడ డైరెక్టర్ హర్షవర్ధన్ తెరకెక్కిస్తున్న భీమా(Bheema) మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ పోలీస్‌గా కనిపించబోతున్నారు. కాగా ఈ మూవీకు KGF, సలార్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కు మ్యూజిక్ ఇచ్చిన రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు.