హైదరాబాద్, వెలుగు: బీజేపీ హైకమాండ్ తనకు గవర్నర్ గా అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉందని త్రిపుర గవర్నర్ గా నియమితులైన నల్లు ఇంద్రసేనా రెడ్డి అన్నారు. బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి థ్యాంక్స్ చెప్పారు. గవర్నర్ గా నియమితులైన సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు పార్టీ అధ్యక్షునిగా, మూడుసార్లు మలక్ పేట్ ఎమ్మెల్యేగా పని చేశానని గుర్తుచేశారు.
మలక్ పేట ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఆదేశాలు అందగానే త్రిపుర గవర్నర్ గా బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పారు. ఇంద్రసేనా రెడ్డిని బీజేపీ నేతలు ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు, ఆంటోని రెడ్డి కలిసి శాలువా కప్పి అభినందించారు.
