జాతీయ జెండాతో సెల్ఫీ తీసి అప్లోడ్ చేస్తే సర్టిఫికెట్ పొందొచ్చు

జాతీయ జెండాతో సెల్ఫీ తీసి అప్లోడ్ చేస్తే సర్టిఫికెట్ పొందొచ్చు

ఆగస్టు 15వ తేదీ ఢిల్లీలోని ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి.  ఈ  వేడుకల్లో ప్రత్యక్షంగా పాల్గొనడానికి... జాతీయ జెండాను ఎగుర వేసిన తర్వాత ప్రధాన మంత్రి చేసే ప్రసంగాన్ని వినడానికి దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 1800 మంది వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానాలను పంపింది.  ఈ 1800 మందిలో  వైబ్రంట్‌ విలేజ్‌ల సర్పంచులు, ఉపాధ్యాయులు, నర్సులు, రైతులు, మత్స్యకారులు; సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, అమృత్ సరోవర్, హర్‌ఘర్ జల్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పని చేస్తున్న వ్యక్తులు ఉన్నారు.

అలాగే దేశవ్యాప్తంగా, కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్న 50 మందిని  కేంద్రం ఆహ్వానించింది.  ఆగస్టు 15న ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను చూసేందుకు జీవిత భాగస్వాములతో కలిసి ఢిల్లీ రావాలని సూచించింది. వీరిలో ఏపీకి చెందిన ఇద్దరు ప్రత్యేక వ్యక్తులు ఉన్నారు.  

మరోవైపు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2022 నుంచి  ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే  ఇందులో భాగంగా ‘హర్ ఘర్ తిరం’గా  పేరుతో ఆగస్టు 13, 14వ తేదీల్లో దేశ ప్రజలు  తమ సోషల్ మీడియా ఖాతాల్లోని  డీపీలు, స్టేటస్‌లలో జాతీయ జెండాను  పెట్టుకోవాలని  ప్రధాని నరేంద్ర మోదీ  సూచించారు.  అయితే హర్ ఘర్ తిరంగాలో భాగంగా.. harghartiranga.com పోర్టల్‌ను కేంద్రం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోర్టల్‌లో దేశ పౌరులు తమ ఫోటోలతో పేరు నమోదు చేసుకోవచ్చని కేంద్రం సూచించింది. ఇలా నమోదు చేసుకున్న వారికి సర్టిఫికేట్ కూడా ఇవ్వనుంది.  అయితే మోదీ పిలుపుతో వెంటనే దేశ పౌరులు వెబ్ సైట్ కు వెళ్లి తమ ఫోటో, పేరును నమోదు చేసుకుంటున్నారు. 

ఎలా చేసుకోవాలంటే

హర్ తిరంగ వెబ్ సైట్  ( https://harghartirang.com ) ఓపెన్ చేయాలి. అక్కడ  అప్లోడ్  సెల్ఫీ విత్ ఫ్లాగ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి అందులో  పేరుతో పాటుగా  ఫోటోను అప్లోడ్  చేయండి.   ఆ తరువాత  సబ్మిట్ బటన్ వస్తు్ంది.  సబ్ మిట్ చేస్తే అంతే..మీకో  సర్టిఫికెట్ కనిపిస్తుంది. దాన్ని మీరు  డౌన్లోడ్ చేసుకోవచ్చు.  లేదా సేవ్ చేసుకుని  ప్రింట్ తీసుకోవచ్చు. అయితే సెల్ఫీతో  పాటు సర్టిఫికెట్ కావాలంటే ఆగస్టు 16 ఉదయం 8 గంటలకు పొందొచ్చు.