రసవత్తరంగా ఐపీఎల్...ప్లే ఆఫ్ చేరే జట్లు ఇవే

రసవత్తరంగా ఐపీఎల్...ప్లే ఆఫ్ చేరే జట్లు ఇవే

ఐపీఎల్ 2023 రసవత్తరంగా జరుగుతోంది. ఫస్ట్ హాఫ్ ఎంత హాట్ హాట్గా సాగిందో..సెకండ్ హాఫ్ లో మ్యాచులు అంతకుమించి హాట్ హాట్గా జరుగుతున్నాయి. ప్రత్యర్థికి 200 పరుగుల టార్గెట్ విధించినా కూడా కాపాడుకోలేని పరిస్థితి నెలకొంది. 200 అయినా..ఆ పై స్కోరు అయినా..అలవోకగా ఛేజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్ బెర్తులపై విపరీతమైన పోటీ నెలకొంది. 

 
ఫియర్ లెస్ గేమ్..

ఈ ఐపీఎల్లో ఇప్పటి వరకు అన్ని మ్యాచుల్లో బ్యాట్స్మన్ దే పైచేయి. ఇన్నింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి బ్యాట్స్మన్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. బంతి ఎక్కడ వేసినా..బౌండరీ దాటిస్తున్నారు. గతంలో కంటే బ్యాట్స్మన్లో ఫియర్ అనేది పోయిందని చెప్పాలి. అందుకే రెచ్చిపోయి ఆడుతున్నారు. జట్టుకు భారీ స్కోర్లు అందిస్తున్నారు. భారీ స్కోర్లను ఈజీగా ఛేజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్ సమీపిస్తున్న కొద్దీ మ్యాచులన్నీ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఎలాగైనా ప్లేఆఫ్ బెర్తును దక్కించుకోవాలని కసితో ఆడుతున్నాయి. 

అగ్రస్థానానికి...

కౌంటర్ అటాక్‌...ఫియర్‌లెస్ క్రికెట్..ఈ సూత్రాలే ఇప్పుడు ముంబై ఇండియన్స్ ను అట్టడుగు స్థానం నుంచి అగ్రస్థానానికి తీసుకెళ్లింది. ఐపీఎల్ 2023 మొదలైనప్పటి నుంచి పేలవ ఆటతీరుతో విమర్శలెదుర్కొన్న ముంబై ఇండియన్స్..పుంజుకుని..ఇప్పుడు పాయింట్ల పట్టికలో టాప పొజీషన్ కు దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు 9 మ్యాచుల్లో 5 విజయాలు సాధించి  10 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. 

ప్లే ఆఫ్ కు వెళ్లే జట్లేవి..

ప్రస్తుతం ఐపీఎల్ హాట్ హాట్ గా సాగుతున్న క్రమంలో ప్లేఆఫ్ చేరే జట్లను తేల్చేశారు హర్భజన్ సింగ్. ప్లేఆఫ్ కు వెళ్లే నాలుగు జట్ల పేర్లను వెల్లడించాడు.  ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈ  సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరుకుంటాయని బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. 

మరో మూడు జట్లకు అవకాశం కానీ...

చెన్నై, ముంబై, బెంగుళూరు, గుజరాత్ జట్లతో పాటు..లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ కు సైతం ప్లేఆఫ్స్‌ చేరే  అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని..కానీ తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని హర్భజన్ సింగ్ తెలిపాడు. ఈ మూడు జట్లూ ప్లేఆఫ్స్ కోసం ఇతర జట్లకు గట్టి పోటీ ఇస్తాయని  చెప్పారు. అయితే ఏ జట్టు టైటిల్ సాధిస్తుందో ఇప్పుడే చెప్పలేమన్నాడు. 

ఏ జట్టు ఏ స్థానం..

ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికను గమనిస్తే 12 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ టాప్ లో ఉంది. ఆ తర్వాత 11 పాయింట్లతో లక్నో  చెన్నై  రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత 10 పాయింట్ల చొప్పున రాజస్థాన్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, పంజాబ్ 4, 5, 6 స్థానల్లో నిలిచాయి.