
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన యువనేత హర్దిక్ పటేల్ ఇవాళ బీజేపీలో చేరారు. గుజరాత్ లోని పార్టీ ఆఫీసులో బీజేపీ కండువా కప్పుకున్నారు. అంతకు ముందు ట్విట్టర్ వేదికగా.. తన జీవితంలో మరో కొత్త అధ్యయం మొదలు కాబోతుందని ట్వీట్ చేశారు.. ప్రధాని మోదీ నాయకత్వంలో చిన్న సైనికుడిగా పని చేయబోతున్నట్లు హర్దిక్ తెలిపారు. ప్రధాని మోదీ మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారని హార్దిక్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో సంతోషంగా లేని ప్రజల కోసం బీజేపీలో చేరుతున్నట్లు హార్దిక్ తెలిపారు. గాంధీనగర్ బీజేపీ పార్టీ ఆఫీసులో హార్దిక్ కు శుభాకాంక్షలు తెలుపుతూ.. భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి..
హర్దిక్ ఈ నెల 18న కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పటేల్ వివిధ వేదికలపై కాంగ్రెస్‌పై విమర్శల దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీ పాటిదార్ వ్యతిరేకం, గుజరాత్ వ్యతిరేకం అని పేర్కొన్నారు.2019లో కాంగ్రెస్‌లో చేరిన హార్దిక్ పటేల్.. 2020, జూలై 11న గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకమయ్యారు. ఆ తర్వాత పార్టీ అధిష్టానం, నాయకత్వం తీరుపై విసుగు చెంది రాజీనామా చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు హార్దిక్ పార్టీని విడడంతో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.
Hardik Patel who recently quit Congress joins BJP in Gandhinagar, Gujarat pic.twitter.com/JT6UtIPPJg
— ANI (@ANI) June 2, 2022
ఇవి కూడా చదవండి
తాగునీరు రావడం లేదని కలెక్టర్ను అడ్డుకున్నారు