గత కొద్ది నెలలుగా స్టార్ హీరో పవన కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమా షూటింగులకు బ్రేక్ ఇచ్చాడు. అయితే పవన్ కొత్త చిత్రాలకి కమిట్ అవ్వకపోయినప్పటికీ గతంలో సంతకం చేసిన చిత్రాలను పూర్తే చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది.
అయితే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి నూతన దర్శకుడు రవి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత ఏ.ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ నిధీ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది.
అయితే ఈ చిత్రం షూటింగ్ పనులు మళ్ళీ మొదలుకానున్నట్లు నిర్మాత ఏ.ఎం రత్నం తెలిపాడు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి మళ్ళీ హరిహర వీరమల్లు షూటింగ్ మొదలు పెడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో కలసి హాలీవుడ్ లెజెండ్ నిక్ పావెల్ స్టంట్ డైరెక్షన్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలను తెరకెక్కించబోతున్నట్లు ట్వీట్ తన అధికారిక సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. దీంతో పవర్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Also Read :- డాన్ అవతారంలో అదరహో.. సినిమా షూటింగ్ స్పాట్‌లో వార్నర్
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ తదితర చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. కానీ ఈ రెండు చిత్రాల షూటింగ్ కూడా మధ్యలోనే ఆగిపోయింది.
Our warrior outlaw's epic action saga #HariHaraVeeraMallu shoot resumes on 23rd September with a massive action sequence under the stunt direction of Hollywood legend Nick Powell, with POWERSTAR 🌟 @PawanKalyan garu.💥⚔️@amjothikrishna @MegaSuryaProd @HHVMFilm pic.twitter.com/5lzATvk4eO
— AM Rathnam (@AMRathnamOfl) September 20, 2024