Pawan kalyan : జనవరి 26న హరిహర వీరమల్లు టీజర్..!

Pawan kalyan : జనవరి 26న హరిహర వీరమల్లు టీజర్..!

పవన్ కళ్యాణ్ కెరీర్లో భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా హరిహర వీరమల్లు. భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా నుంచి త్వరలో బిగ్ అప్ డేట్ రానున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా చిత్ర బృందం నుంచి విడుదలైన పోస్టర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే, ఈ సినిమా టీజర్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జనవరి 26న టీజర్ విడుదల చేస్తామంటూ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై డైరెక్టర్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడో పూర్తి కావాల్పి ఉండగా.. పవన్ రాజకీయాల్లో బిజీ అవటంవల్ల ఆలస్యం అవుతోంది. ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేసే ఆలోచనలో మూవీ టీం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. హరిహర వీరమల్లుకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.