బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్కు హరీష్ రావు శుభాకాంక్షలు

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్కు హరీష్ రావు శుభాకాంక్షలు

బిగ్ బాస్ సీజన్ 7 విజేత రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prasanth) కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. సిద్ధిపేటకు చెందిన రైతుబిడ్డ బిగ్ బాస్ విజేతగా నిలువడం చాలా గర్వంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు.

బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచినందుకు మా సిద్దిపేటకు చెందిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌కు నా అభినందనలు. పల్లవి ప్రశాంత్.. ఈ పేరు రైతుకు ఇంటి పేరుగా మారింది. పొలం నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు అతని ప్రయాణం ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.. అంటూ రాసుకొచ్చారు హరీష్ రావు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.