
గత ప్రభుత్వాల హయాంలో కరెంట్, ఎరువుల కోసం ఎదురుచూపులు ఉండేవని..ఇప్పుడు ఆ కష్టాలు లేవన్నారు మంత్రి హరీష్ రావు. 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని కేసీఆర్ ఆరేళ్లలో చేసి చూపించారన్నారు. రాష్ట్రంలో ఇకపై నీటికష్టాలు ఉండవన్నారు. సిద్దిపేట జిల్లా కొడకండ్లలో మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ ప్రాజెక్టు వెళ్లే ప్రధాన కాలువ దగ్గర కూడవెళ్లి వాగులోకి గోదావరి జలాలను విడుదల చేశారు హరీష్ రావు.