6 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2వేల 6 కోట్ల రుణమాఫీ

6 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2వేల 6 కోట్ల రుణమాఫీ

15న సీఎం కేసీఆర్ 50వేల లోపు రైతు రుణాల మాఫీని లాంఛనంగా ప్రకటిస్తారని చెప్పారు.. మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి. 16 నుంచి రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తం జమ చేస్తామన్నారు. ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో 2వేల ఆరు కోట్ల రుణమాఫీ డబ్బులు వేస్తామన్నారు. 50వేల లోపు రుణాలన్నీ మాఫీ చేస్తున్నామని చెప్పారు. బీఆర్కే భవన్ లో రైతుల రుణమాఫీపై 42 బ్యాంకులకు చెందిన అధికారులతో.. మంత్రులు సమావేశమయ్యారు. బ్యాంకర్లు రుణమాఫీ మొత్తాన్ని ఏ ఇతర ఖాతా కింద జమ చేయవద్దన్నారు. రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తం జమ కాగానే.. మాఫీ అయినట్లు లబ్దిదారుల ఫోన్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో SMSలు వెళ్లాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. రుణమాఫీ జరిగిన రైతుల అక్కౌంట్లు జీరో చేసి.. కొత్తగా పంట రుణాలివ్వాలని సూచించారు.