వారి త్యాగాలను తలుచుకోవడం మనందరి బాధ్యత

వారి త్యాగాలను తలుచుకోవడం మనందరి బాధ్యత

ప్రజాస్వామ్య స్వేచ్ఛను పొందడం కోసం1948 కి ముందు నాటి తెలంగాణ యావత్ సమాజం ఉద్యమించిందని, వారి త్యాగాలను తలుచుకోవడం మనందరి బాధ్యత అని రాష్ట్ర వైద్య శాఖా మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో  నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలకు ఆయన హాజరై జాతీయ జెండా ఎగరవేశారు. తెలంగాణ సాయుధ పోరాట జ్వాలను రగిలించిన దొడ్డి కొమురయ్యతో పాటు రావి నారాయణ రెడ్డి, స్వామి రామానంద తీర్థ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, చాకలి ఐలమ్మ లాంటి ఎందరో యోధుల త్యాగాలను భవిష్యత్​ తరాలకు తెలియ చెప్పాలన్నారు. ఉత్సవాల్లో  కేజీబీవీ, మోడల్​ స్కూల్​ స్టూడెంట్ల డ్యాన్సులకు ఫిదా అయిన ఆయన .. స్కూళ్ల అభివృద్ధికి రూ. 10 లక్షల చొప్పున  ప్రోత్సాహం ప్రకటించారు.