ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని హరీశ్​రావు డిమాండ్

ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని హరీశ్​రావు డిమాండ్
  •     ఎమ్మెల్యే హరీశ్​రావు డిమాండ్

సిద్దిపేట, వెలుగు: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ పథకం మంచిదే అయినా, దానితో ఉపాధి కోల్పోతున్న ఆటోడ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. ప్రతి ఆటో డ్రైవర్​కు నెలకు రూ.15 వేలు జీవన భృతి ఇవ్వాలని కోరారు. శనివారం సిద్దిపేట మినీ స్టేడియంలో  సిద్దిపేట ఆటో క్రెడిట్ కో–ఆపరేట్ సోసైటీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలు నిర్వహించారు. హరీశ్​రావు పోటీలను  ప్రారంభించి మాట్లాడారు.

ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ఒకరికి మంచి చేస్తూ.. మరొకరి పొట్టకొట్ట కూడదన్నారు. ఆటో కార్మికులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని, వారి తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. అనంతరం భారత్ నగర్ లో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల విజేతలకు హరీశ్​బహుమతులు అందజేశారు. చిన్నకోడూరు మండలం గోనెపల్లిలో మండల స్థాయి వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేయగా, హరీశ్​పాల్గొని ప్రారంభించారు. సిద్దిపేట కోమటి చెరువు నెక్లెస్ రోడ్డులో బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్​లో పాల్గొని పతంగి ఎగరవేశారు.

ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో టార్గెట్ బాల్ పోటీలను హరీశ్​ప్రారంభించారు. 15 రాష్ట్రాల క్రీడాకారులు టార్గెట్ బాల్ పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేట మోహిన్ పురాలోని కొత్త వెంకటేశ్వరాలయం నుంచి అయోధ్యలో అన్నదానానికి సామగ్రి తీసుకెళ్తున్న వెహికల్స్​ను ఎమ్మెల్యే హరీశ్​జెండా ఊపి ప్రారంభించారు. సిద్దిపేట ముర్షద్ గడ్డలో జరుగుతున్న ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నారు. క్యాంప్​ఆఫీసులో వివిధ సంఘాల క్యాలెండర్లను ప్రారంభించారు.